: నదిలో కొట్టుకుపోయిన దంపతులు!
దంపతులు నదిలో కొట్టుకుపోయిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పీలేరు మండలంలోని బాలంవారిపల్లి వద్ద ఈ సంఘటన జరిగింది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పింఛా నదిలో కొట్టుకుపోయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో నదులు, చెరువులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు పలు జిల్లాల్లో వీధులు జలమయమయ్యాయి. ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా జనజీవనం స్తంభించడమే కాకుండా, రోడ్లు, వంతెనలు, రైల్వే బ్రిడ్జిలు మొదలైనవి దెబ్బతిన్న విషయం తెలిసిందే.