: ఇంటర్నెట్ వినియోగంలో ఐఎస్ఐఎస్ ఆరితేరింది: పారికర్
అంతర్జాలం వినియోగంలో ప్రముఖ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆరితేరిందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన డిఈఎఫ్ సీఓఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ అవసరాల నిమిత్తం ఇంటర్నెట్ వినియోగంలో సైన్యం విస్తృతమైన అవగాహన పెంచుకోవాలని అన్నారు. భవిష్యత్ లో యుద్ధాలన్నీ సైబర్ కేంద్రంగా జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఇంటర్నెట్ వినియోగంపై విశేషమైన అనుభవం సంపాదించుకుని, అప్రమత్తంగా ఉంటే తీవ్రవాదుల ఆనుపానులన్నీ పసిగట్టేయవచ్చని ఆయన చెప్పారు. భద్రత విషయంలో ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్ లో కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.