: ప్లేట్లు కడిగించడం ద్వారా 1,50,000 పౌండ్లు సేకరించారు


లండన్ లోని స్వచ్చంద సంస్థ 'మేక్ ఏ విష్' ఫౌండేషన్ వినూత్న కార్యక్రమం ద్వారా నిధులు సేకరించింది. ఫెయిరీ డిష్ వాష్ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొనే వారు ఒక పౌండ్ చెల్లించి కేక్ కొనుక్కుని తిని, వారు తిన్న ప్లేటును ఫెయిరీ డిష్ వాష్ తో క్లీన్ చేయాలి. అలా చేయడం ద్వారా ఔత్సాహికులు కేక్ కు చెల్లించే పౌండ్ కు ఫెయిరీ డిష్ వాష్ సంస్థ పది పౌండ్లు జత చేసి మేక్ ఏ విష్ ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తుంది. ఈ కార్యక్రమానికి విశేషమైన ఆదరణ లభించింది. మొత్తం 12,000 మంది ఔత్సాహికులు కేకులు కొని తిని, ప్లేట్లు కడిగారు. తద్వారా మేక్ ఏ విష్ ఫౌండేషన్ కు 1,50,000 పౌండ్లు విరాళంగా లభించాయి.

  • Loading...

More Telugu News