: విభజన సమస్యల పరిష్కారానికి కమిటీ వేసిన కేంద్రం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించేందుకు ఐదుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో సభ్యులుగా ఏపీ రెసిడెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సింఘాల్, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డి, తెలంగాణ ఆర్థికశాఖ కార్యదర్శి కేఏ కృష్ణారావులు ఉన్నారు. రెండు నెలల్లో సమస్యలను కొలిక్కి తీసుకురావాలని కేంద్రం ఆదేశించింది. ఈ నెల 26న కమిటీ తొలిసారి సమావేశమై విధివిధానాలు, అంశాల ప్రాధాన్యతను ఖరారు చేయనుంది.