: నాగ చైతన్యకు రానా శుభాకాంక్షల ట్వీట్ !
యువహీరో నాగ చైతన్యకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపాడు మరో యువహీరో రానా. సోమవారం నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పాడు. ‘Happy birthday @chay_akkineni. Love u the most!!’ అంటూ రానా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో పాటు నాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసే ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో తాత రామానాయుడితో నాగ చైతన్య, రానాలు ఉన్నారు. నాగ చైతన్య తాజా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో' సక్సెస్ సాధించాలని రానా తన శుభాకాంక్షలు తెలిపాడు.