: సోదరుడికి వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మంచు లక్ష్మి!
టాలీవుడ్ లో మోహన్ బాబు కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ఆయన సంతానం మొత్తం సినీ రంగంలోనే స్థిరపడ్డారు. మంచు విష్ణు, మంచు మనోజ్ నటులుగా సత్తా చాటుతుండగా, వారి సోదరి మంచు లక్ష్మి, సినీ నటి, వ్యాఖ్యాత, నిర్మాత, తాజాగా సింగర్ గా విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుకుంటోంది. సోదరుడు విష్ణు పుట్టిన రోజును పురస్కరించుకుని మంచు లక్ష్మి విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పింది. విష్ణు చంక ఎక్కి మరీ శుభాకాంక్షలు చెప్పింది. విష్ణు తనకు సోదరుడే కానీ తండ్రి లా చూసుకుంటాడని వ్యాఖ్యానం కూడా జత చేసి, తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టింది. వారి అభిమానులను ఈ ఫోటో ఆకట్టుకుంటోంది.