: కౌన్సిల్ సమావేశంలో చెప్పులతో దాడి చేసుకున్న ఎంఐఎం కౌన్సిలర్లు!
రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ఇద్దరు కౌన్సిలర్లు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లు సోఫియా, ఫసియుద్దీన్ ల మధ్య కొంతకాలంగా వ్యక్తిగత వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో సర్వే నంబర్ 128 స్థలం విషయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఆగ్రహావేశానికి లోనై చివరగా చెప్పులు తీసుకుని కొట్టుకున్నారు. తోటి కౌన్సిలర్లు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది.