: బాలకృష్ణ బంధువులకు 498 ఎకరాల భూమిని చంద్రబాబు కట్టబెట్టారు: శ్రీకాంత్ రెడ్డి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. భూముల కేటాయింపులపై రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై గతంలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు... ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో తన వియ్యంకుడు బాలకృష్ణ బంధువులకు కోట్లాది రూపాయల విలువైన 498 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకే కేటాయించారని ఆరోపించారు. అంతేకాకుండా, ఉత్తరాంధ్రలో ఎకరం రూ. 10 కోట్లు విలువ చేసే భూమిని రూ. 50 లక్షల చొప్పున 50 ఎకరాలు కట్టబెట్టారని మండిపడ్డారు. ఎంపీ గల్లా జయదేవ్ కు కోట్ల విలువైన భూమిని లక్షలకే ఇచ్చేశారని విమర్శించారు. వందల కోట్ల విలువైన భూములను సొంత మనుషులకు కట్టబెట్టడం సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కూడా అంతులేని అవినీతి జరుగుతోందని అన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఈ అంశాలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అవినీతిని నిలదీస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News