: మానవత్వాన్ని చాటుకున్న రాష్ట్రపతి కుమారుడు


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా, మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించేందుకు సాయం చేశారు. పశ్చిమ బెంగాల్ లో సుమితపాల్ అనే మహిళ తన కుమారుడు ఆర్ఘ్యతో కలసి బైక్ పై బురద్వాన్ నుంచి గస్కరాలోని ఆలయానికి వెళతుండగా ప్రమాదానికి గురయ్యారు. కింద పడిపోవడంతో సుమితపాల్ తలకు తీవ్ర గాయమయింది. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండటంతో ఆర్ఘ్యకు ఏం చేయాలో అర్థంకాలేదు. ఆ సమయంలో అటువైపే వెళతున్న అభిజిత్ ముఖర్జీ ప్రమాదాన్ని గమనించారు. వెంటనే తన కారులోనే వారిని గస్కరా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, బురుద్వాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో... వెంటనే అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, వైద్య ఖర్చుల కోసం ఆర్ఘ్యకు కొంత డబ్బును కూడా ఇచ్చారు. అభిజిత్ చేసిన పనిని పలువురు కొనియాడుతున్నారు. అయితే, ఇందులో 'తాను చేసిందేమీ లేదని... ఒక మనిషిగా సాటి మనిషికి సాయపడ్డాను, అంతే' అని అభిజిత్ ముఖర్జీ అన్నారు.

  • Loading...

More Telugu News