: అర్జెంటినాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికకానున్న మారికో మాక్రి


అర్జెంటినాకు కొత్త అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు మారికో మాక్రి ఎన్నిక కానున్నారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లో ఆ పార్టీకి ఇప్పటివరకు 52 శాతం ఓట్లు వచ్చాయి. మొన్నటివరకు అధికారంలో ఉన్న డానియల్ సియోలికి 48 శాతం ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో మారికోనే అర్జెంటినా నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. దాంతో ఓ దశాబ్దం తరువాత అర్జెంటినాలో ప్రతిపక్ష పార్టీ తిరిగి అధికారంలోకి వస్తోంది. కుంటుపడుతున్న దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు విదేశీ పెట్టుబడులు తీసుకువస్తామని మారికో చేసిన హామీలు ఫలించాయని నిపుణులు అంటున్నారు.

  • Loading...

More Telugu News