: పని చేసే వారికే వేతనాల పెంపు: కేంద్రం మెలిక!


పొద్దున్నే పది గంటలకు వచ్చి, కాసేపు కాలక్షేపం చేసి నెల తిరగ్గానే జీతం జేబులో వేసుకుపోవచ్చు అనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దుర్వార్త. సక్రమంగా పని చేయని వారికి ఇంక్రిమెంట్లు, వార్షిక వేతన పెరుగుదల వర్తించకుండా చేయాలని ఏడో వేతన సంఘం పంపిన సిఫార్సులు, ఉద్యోగుల్లో కొత్త గుబులును పుట్టిస్తున్నాయి. పే కమిషన్ పంపిన రికమండేషన్స్ మేరకు, అన్ని కేటగిరీల్లో, అన్ని స్థాయుల్లో పీఆర్పీ (పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే - ప్రదర్శన ఆధారిత వేతనం) అమలు చేయాలని, పదోన్నతుల్లానే వేతనాన్ని సైతం ఓ క్రమానుగుణంగా పెంచాలని తెలిపింది. నిర్దేశిత స్థాయిని చేరిన ఉద్యోగులకే వేతన పెరుగుదల ప్రకటించాలని వెల్లడించింది. వారి పనితీరు సంతృప్తికరం కాకుంటే, వారు సాధారణ పదోన్నతులకు సైతం అనర్హులని తేల్చింది. స్వచ్ఛంద పదవీ విరమణ ఇకపై సర్వీస్ లోని 10, 20, 30వ ఏట మాత్రమే పొందేలా నిబంధనలు సరళించాలని అభిప్రాయపడింది. తమ సిఫార్సులను అమలు చేసే ముందు కొంత కాలం పాటు ఉద్యోగుల పనితీరును ప్రభావితం చేసేలా ఆకర్షణీయ బోనస్ పథకాలను ప్రవేశపెట్టాలని వేతన సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది.

  • Loading...

More Telugu News