: వెంకన్న సేవలో టీ టీడీపీ ఫైర్ బ్రాండ్... తిరుమలేశుడికి కూతురు వివాహ ఆహ్వాన పత్రిక సమర్పణ
టీ టీడీపీ ఫైర్ బ్రాండ్, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ ఉపనేత రేవంత్ రెడ్డి నిన్న కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. మొన్న రాత్రే తిరుమల చేరుకున్న రేవంత్ రెడ్డి కుటుంబం నిన్న ఉదయం ప్రాత:కాల సేవలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. రెండు నెలల క్రితం రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 20న ఆమె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పత్రికలు కూడా రెడీ అయ్యాయి. పెళ్లి పత్రికలతో తిరుమల వచ్చిన రేవంత్ రెడ్డి కుటుంబం తొలి పత్రికను వెంకన్న పాదాలకు సమర్పించింది. తన కూతురు పెళ్లికి సంబంధించిన తొలి ఆహ్వానాన్ని వెంకన్నకు అందజేసేందుకే తాము తిరుమల వచ్చామని దర్శనానంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాకు చెప్పారు.