: షీనా కేసులో సీబీఐకి కీలక ఆధారాలు!
షీనా బోరా హత్య కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను సీబీఐ సేకరించింది. షీనాకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పీటర్ ముఖర్జీ కుమారుడు రాహుల్ ఈరోజు సీబీఐకి అందించాడు. షీనాను ఇంద్రాణీ తన సోదరిగా అందరికీ పరిచయం చేసింది. దీంతో రాహుల్ తో షీనా ప్రేమాయణం సాగించింది. అయితే, షీనా తీరుపై పలుసార్లు ఇంద్రాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ షీనా మాత్రం రాహుల్ నే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పిందని... ఈ నేపథ్యంలోనే తనకు ఖరీదైన భవనం కొనివ్వమని అడిగిందని సమాచారం. ఇంద్రాణీ తనకు కనుక ఖరీదైన భవనం కొనివ్వకపోతే తాను చెల్లెల్ని కాదన్న విషయాన్ని బయటపెడతానని బెదిరించడంతో పాటు మరికొన్ని కారణాలతో షీనాను హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది.