: కడప జిల్లాలో కుంగుతున్న భూమి.... భయం గుప్పిట్లో ప్రజలు


నాయినోరిపల్లె. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని చిన్న గ్రామం. మొన్నటిదాకా అంతా బాగానే ఉంది. మొన్న రాత్రి ఉన్నట్టుండి గ్రామంలోని ఓ ప్రాంతంలో భూమి కుంగిపోయింది. ఏదో కారణం ఉంటుందిలే అనుకున్న గ్రామస్తులు దానిని అంత సీరియస్ గా తీసుకోలేదు. గంటలు గడిచే కొద్దీ గ్రామంలో భూమి కుంగుతున్న ప్రాంతాలు పెరిగాయి. దాదాపు గ్రామంలోని 15 ప్రాంతాల్లో భూమి కుంగిపోయింది. దీంతో గ్రామంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వాటికి గోతులు అనే పదం కంటే లోయలు అనే పదం సరిపోతుందేమో. భూమి కూలిన కారణంగా గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయింది. వరుసగా చోటుచేసుకున్న ఘటనలతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న అధికారులు గ్రామంలో ఏర్పడ్డ లోయలను చూసి కంగుతిన్నారు. ముందు జాగ్రత్త చర్యల కింద గ్రామం నుంచి ప్రజలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలో భూమి కుంగిపోవడానికి గల కారణాలపై అధికార యంత్రాంగం ఆరా తీస్తోంది. భూగర్భ శాస్త్ర నిపుణులను రప్పించి పరిశీలన జరిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News