: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ... నలుగురు మహిళా మావోయిస్టుల హతం


నిషేధిత మావోయిస్టుల కారణంగా నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న ఛత్తీస్ గఢ్ లో నిన్న రాత్రి మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా పరిధిలోని అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. గంటల తరబడి కొనసాగిన ఈ కాల్పుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో సోదాలు చేసిన భద్రతా దళాలు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News