: మొత్తానికి 'ఐపీఎల్'లో ఆడేస్తున్నాడు... తేజస్వీ యాదవ్ పై సోషల్ మీడియా సెటైర్లు!


సోషల్ మీడియాలో తాజాగా నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటో తెలుసా?...బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్! సోషల్ మీడియాలో ఈయనపై చోటు చేసుకుంటున్న సెటైర్ల లాంటి కామెంట్లలో కొన్ని... * నాలుగు సీజన్లకు ప్రాతినిధ్యం వహించినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడలేకపోయాడు కానీ, ఇండియన్ పొలిటికల్ లీగ్ లో ఆడనున్నాడు. ఎలాగైతేనేం, ఐపీఎల్ లో ఆడేస్తున్నట్టే లెక్క. * విద్య విజయానికి సోపానం అనే వారికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. తేజస్వీని చూసి నేర్చుకోవాలి. * ప్రజాస్వామ్యం వర్థిల్లాలి...తేజస్వీ లాంటి వాళ్లే డెమోక్రసీని అనుభవిస్తారు. * లాలూకి 9 మంది సంతానం. అందులో ఇద్దరికే పదవి లభించింది, పాపం...ఇంకా ఏడుగురున్నారు! * రాజకీయ నాయకుడి కొడుకుగా పుడితే నీకు ఏది కావాలంటే దానిని ప్రజాస్వామ్యం అందిస్తుంది...అందులో భాగంగానే తేజస్వీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది.

  • Loading...

More Telugu News