: గంగిరెడ్డి విషయంలో చంద్రబాబుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయిస్తోంది: జూపూడి


సీఎం చంద్రబాబు నుంచి ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి ప్రాణహాని ఉందంటూ అతని భార్య మాళవిక చేసిన ఆరోపణలను టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. సీఎం చేస్తున్న అభివృద్ధి పనులు చూడలేకే ఆ పార్టీ ఇలా చేస్తోందని మండిపడ్డారు. గంగిరెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలనుకుంటే పోలీసులు అంత కష్టపడి ప్రాణాలతో ఎందుకు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఎవరికీ ఎవరి వల్లా ప్రాణహాని ఉండబోదని పేర్కొన్నారు. అంతేగాక గంగిరెడ్డికి ఏదైనా జరిగితే ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న అతని భార్య ప్రకటనలో వాస్తవం లేదని కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News