: తీరు మార్చుకోండి... లేకపోతే అంతం చేస్తాం: టీఆర్ఎస్ నేతలకు మావోల హెచ్చరిక
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు మావోయిస్టులు ఘాటు హెచ్చరికలే జారీ చేశారు. మొన్న ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ చార్జీ మన్నె రామకృష్ణతో పాటు మరో ఐదుగురిని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు వారిని తమ అధీనంలోనే ఉంచుకున్న మావోయిస్టులు నేటి ఉదయం వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మావోల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డ రామకృష్ణ చర్లలో మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల ఎజెండాతో పాలన సాగిస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అందుకు విరుద్ధంగా వ్యవరిస్తున్నారని తమపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. అంతేకాక సర్కారు తీరు మారకుంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా టీఆర్ఎస్ నేతలను అంతం చేస్తామని హెచ్చరించారన్నారు. ఇకనైనా సర్కారు తన తీరు మార్చుకుని ఎన్ కౌంటర్లు, కూంబింగ్ లు నిలిపివేయాలని హెచ్చరించారని ఆయన తెలిపారు.