: బెజవాడకు మకాం మార్చిన దేవినేని ఉమా... రూ.3.5 కోట్లతో జలవనరుల శాఖ కార్యాలయం


ఏపీ కేబినెట్ లోని మరో కీలక మంత్రి తన మకాంను విజయవాడకు మార్చేశారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన కార్య కలాపాలన్నింటినీ విజయవాడ నుంచే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖకు చెందిన దాదాపు అన్ని కార్యాలయాలను ఆయన విజయవాడకు తరలించారు. తాజాగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా తన మకాంను విజయవాడకు మార్చేశారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో రూ.3.5 కోట్లతో కొత్తగా నిర్మించిన జలవనరుల శాఖ కార్యాలయంలోకి దేవినేని ఉమా నిన్న ఎంట్రీ ఇచ్చారు. తన సతీమణితో కలిసి శాస్త్రోక్తంగా పూజలు చేసిన ఉమా ఇకపై తన కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచి కొనసాగించనున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News