: అప్పుడు భయపడ్డారు... ఇప్పుడు కౌగిలించుకున్నారు!


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీహార్ ఎన్నికల సందర్భంగా నితీశ్ కుమార్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. అయితే అవినీతికి వ్యతిరేకంగా పని చేసే ముఖ్యమంత్రిగా పేరున్న కేజ్రీవాల్ మహాకూటమిలోని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సరసన కూర్చునేందుకు కూడా సంశయించారు. అవినీతితో రాజీ అయ్యారనే పేరు వస్తుందేమోననే శంకతో ఆయనతో వేదిక పంచుకునేందుకు ససేమిరా అన్నారు. అయితే బీహార్ లో ఆర్జేడీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణా స్వీకారోత్సవానికి హాజరైన కేజ్రీవాల్ ను లాలూప్రసాద్ యాదవ్ కౌగిలించుకున్నారు. లాలూ చొరవకు కేజ్రీవాల్ కూడా చేతులు కలిపారు. దీంతో అప్పుడు భయపడ్డా, ఇప్పుడు కౌగిలించుకున్నారు.

  • Loading...

More Telugu News