: ఇకపై ఏపీ మాల్స్ లో మద్యం ఏరులు!


ఇకపై ఆంధ్రప్రదేశ్ సూపర్ మార్కెట్లు, మాల్స్ లో మద్యం ఏరులై పారనుంది. ప్రత్యేక పార్లర్లు ఏర్పాటు చేసి అందులో బీర్లు, వైన్ విక్రయించనున్నారు. కేరళ తరహా విధానంపై అధ్యయనం చేసిన ఏపీ సర్కార్ ఎక్సైజ్ అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 2015-16 సంవత్సరానికి కొత్త బార్ పాలసీని తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన నేపథ్యంలోనే అధికారుల నుంచి నివేదికలను పంపించాలని ఆ శాఖ కోరింది. అయితే, కొత్త బార్ల ఏర్పాటుకు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనే దానిపై కూడా ఎక్సైజ్ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ కొత్త బార్లను ఏర్పాటు చేయనున్నారు. ఎంత జనాభాకు ఒక బార్ ఏర్పాటు చెయ్యాలి? లైసెన్స్ ఫీజు ఎంత తీసుకోవాలనే అంశాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బార్ ఏర్పాటుకు సంబంధించి మూడు కేటగిరీలు ఉన్నాయి. మొదటి కేటగిరీ... 3 లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో ప్రతి 30 వేల మందికి ఒక బార్ రెండవ కేటగిరీ...3 నుంచి 7 లక్షల జనాభా ఉన్న ప్రతిచోట ప్రతి 20 వేల మందికి ఒక బార్ మూడో కేటగిరీ... 7లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రతిచోట ప్రతి 12 వేల మందికి ఒక బార్ ఏర్పాటు చేయవచ్చు.

  • Loading...

More Telugu News