: భూ రికార్డుల ప్రక్షాళనే లక్ష్యంగా 'మీ ఇంటికి-మీ భూమి' చేపట్టాం: కేఈ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు చేపట్టిన 'మీ ఇంటికి-మీ భూమి' కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. దాని నిర్వహణలో భాగంగా గ్రామసభల్లో అనేక ఫిర్యాదులు వస్తుండగా, పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే భూమి రికార్డుల ప్రక్షాళనే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. తొలివిడత గ్రామసభల్లో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఇందుకోసం పరిష్కారానికి ఉన్నతాధికారులతో కమిటీలు వేశామని తెలిపారు. డిసెంబర్ 31లోగా ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఫిర్యాదులపై అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేఈ హెచ్చరించారు.