: మావోయిస్టు నేత గాజర్ల అశోక్ మా అదుపులో లేడు... లొంగిపోతే వేధింపులు ఉండవు: కరీంనగర్ ఎస్పీ


మావోయిస్టు పార్టీ నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ లొంగిపోయాడని, కరీంనగర్ పోలీసుల అదుపులో ఉన్నాడని నిన్న (గురువారం) వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు వాస్తవం కాదని కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ తెలిపారు. అశోక్ తమ అదుపులో లేడని తెలుపుతూ... ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అశోక్ జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నానన్నారు. ఆయనకు పోలీసుల తరపు నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని హామీ ఇచ్చారు. అలాకాకుంటే కోర్టులోనైనా లొంగిపోవచ్చని ఎస్పీ సూచించారు. ప్రభుత్వపరంగా వచ్చే పునరావాస ఏర్పాట్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అశోక్ మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News