: కేటీఆర్ నోట మహేశ్ బాబు డైలాగులు... మీరూ చూడండి!


తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నోటి వెంట మహేశ్ బాబు సినిమా డైలాగులు వచ్చాయి. వరంగల్ ఉపఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగుస్తుందనగా, టీఆర్ఎస్ ఆభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో 'పోకిరి' చిత్రంలోని "ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో..."ను గుర్తు చేస్తూ, "ఎవరి ఓటుతో మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుద్దో వాళ్లు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు. మీ ఓటుతో వాళ్ల మైండ్ దిమ్మతిరగాల, బ్లాంక్ కావాల" అన్నారు. ఆయన 'పోకిరి' డైలాగులు సభను అలరించాయి. కేటీఆర్ వ్యాఖ్యల వీడియో ఇదే!

  • Loading...

More Telugu News