: చింటూ ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డు ఇస్తాం: అడిషనల్ డీజీ ఆర్పీ ఠాకూర్


చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చింటూ రాయల్ అలియాస్ చంద్రశేఖర్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని గురించి తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని అడిషనల్ డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. ఈ కేసులో ప్రత్యేక అధికారిగా ఆర్ పీ ఠాకూర్ ను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో ఇవాళ హత్య జరిగిన కార్పొరేషన్ కార్యాలయాన్ని ఉన్నతాధికారులతో కలసి ఆయన పరిశీలించారు. తరువాత మేయర్ నివాసానికి వెళ్లారు. మరోవైపు చింటు పోలీసులకు లొంగిపోయినట్టు వార్తలొస్తున్నాయి.

  • Loading...

More Telugu News