: తీహార్ జైలుకు మాఫియా డాన్ చోటా రాజన్... ముంబై కేసులన్నీ సీబీఐకి ట్రాన్స్ ఫర్


రెండు దశాబ్దాలకు పైగా ముంబై పోలీసులకు చిక్కకుండా తిరిగిన మాఫియా డాన్ చోటా రాజన్ ఇకపై తీహార్ జైలులో విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆస్ట్రేలియా నగరం సిడ్నీ నుంచి జింబాబ్వేకు వెళుతున్న చోటా రాజన్ ను ఇండోనేసియా పోలీసులు బాలి అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇండోనేసియా ప్రభుత్వంతో మంతనాలు జరిపిన సీబీఐ అధికారులు అతడిని ఇటీవలే కట్టుదిట్టమైన భద్రత మధ్య భారత్ కు తీసుకొచ్చారు. అతడిపై కేసులన్నీ ముంబైలో నమోదైన నేపథ్యంలో అతడిని అక్కడికే తరలిస్తారని అంతా భావించారు. అయితే ముంబై పోలీసు విభాగంలో తన ప్రత్యర్థి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఏజెంట్లున్నారని, తనకు ప్రాణ హాని ఉంటుందని వాదించిన చోటా రాజన్ తనను ఢిల్లీకి తరలించాలని వేడుకున్నాడు. దీంతో ముంబై పోలీసులు అతడిపై నమోదు చేసిన కేసులన్నింటినీ సీబీఐ అధికారులు తమకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. భారత్ కు తీసుకువచ్చిన అతడిని సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు బుధవారం నాటి కోర్టు తీర్పుతో అతడిని తీహార్ జైలుకు తరలించారు. మొన్నటిదాకా నేర సామ్రాజ్యాధినేతగా సకల భోగాలతో రాయల్ గా జీవించిన అతడు తాజాగా కట్టుదిట్టమైన భద్రత ఉన్న తీహార్ జైల్లో నేరగాళ్లతో కలిసి జైలు జీవితం గడపనున్నాడు.

  • Loading...

More Telugu News