: వరంగల్ ఉప ఎన్నికలు కేసీఆర్ కు కనువిప్పు కావాలి: ఎల్.రమణ


వరంగల్ ఉప ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనువిప్పు కావాలని టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఇల్లెందులో ఆయన మాట్లాడుతూ, హామీల వర్షం కురిపించి, ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కు వరంగల్ ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలని అన్నారు. ధనిక రాష్ట్రమైనప్పటికీ పేదలను ఆయన విస్మరించారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిని విస్మరించి, ప్రజా శ్రేయస్సును గాలికి వదిలేశారని ఆయన అభిప్రాయపడ్డారు. తాజా ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి పెద్ద గుణపాఠం కావాలని ఆయన సూచించారు. ప్రజాతీర్పు కేసీఆర్ కు కనువిప్పు కావాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News