: నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్


నెల్లూరు, కడప జిల్లాల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ రెండు జిల్లాల్లో నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఆయా ప్రాంతాల్లో వరద బాధితులను జగన్ పరామర్శిస్తారు. కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రెండు జిల్లాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోగా.. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. కాగా, ఈ రెండు జిల్లాల్లో వరదబాధితులకు సహాయం అందట్లేదంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News