: ప్రేమ వివాహం చేసుకున్న తమిళ నటుడు ఆరి!
తమిళ నటుడు ఆరి ప్రేమ వివాహం చేసుకున్నాడు. శ్రీలంకకు చెందిన నదియ, ఆరిల ప్రేమ వ్యవహారం మూడేళ్లుగా కొనసాగుతోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో వారి పెళ్లి బుధవారం ఉదయం చెన్నయ్ లోని ఒక ఆలయంలో జరిగింది. అయితే, వివాహ విషయాన్ని ఆరి బహిరంగ పరచలేదు. మంగళవారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో రిసెప్షన్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే ఆ వేడుకకు హాజరయ్యారు. బీఏ పట్టభద్రురాలైన నదియ లండన్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రఖ్యాత దర్శకులు కే.బాలచందర్, భారతీరాజా ముఖ్యపాత్రలు పోషించిన 'రెట్టచుళి' చిత్రం ద్వారా ఆరి హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మాలై పొళుదు మయక్కత్తిలే, ధరణి, నెడుంశాలై తదితర చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఇటీవల నయనతారతో ఆరి నటించిన 'మాయ' చిత్రం విజయం సాధించింది.