: మీ ఫేస్ బుక్ అకౌంట్ లో ఫ్రెండ్స్ లిస్ట్ 300 దాటిందా... అయితే మీరు ఒత్తిడిలో పడ్డట్టే!
సోషల్ మీడియా పెత్తనం చేస్తున్న రోజులివి. చాలా మంది తమ ఆనందం, బాధ, సుఖం, దుఃఖం, ఆప్యాయత, ప్రేమ వంటి భావాలను సోషల్ మీడియాలోనే పంచుకుంటున్నారు. దీంతో సామాజిక మాధ్యమంలో ఎంత మంది స్నేహితులు ఉంటే, అంత గ్రేట్. మనం పెట్టిన పోస్టుకు ఎన్ని లైకులు వస్తే అంత బాగా ప్రమోట్ అయినట్టు లెక్క. అయితే ఫేస్ బుక్ లో 300 మంది స్నేహితుల సంఖ్యను దాటితే మీరు ఒత్తిడిలో పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 12-17 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 88 మందిపై ఈ సర్వే చేసినట్టు నిపుణులు తెలిపారు. ఈ పరిశోధనలో స్నేహితుల సంఖ్య 300 దాటితే ఒత్తిడిలో పడ్డట్టేనని వారు చెబుతున్నారు. ఆ సమయంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ అధికంగా విడుదలవుతుందని వారు తెలిపారు. అయితే లైకులు కొట్టడం, ఇతరుల ఫోటోలకు మెసేజ్ లు పెట్టడం ద్వారా ఈ ఒత్తిడిని అధిగమించవచ్చని వారు వెల్లడించారు. స్నేహితుల సంఖ్య ఎంత పెరిగితే అంత ఒత్తడికి గురయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.