: కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేయండి: జగన్
వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న వైకాపా అధినేత జగన్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉప ఎన్నికను తీసుకువచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరే అని... ఆ అవసరం ఆయనకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేయాలని జగన్ పిలుపునిచ్చారు. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పటి వరకు ఎంతమేర రుణమాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు.