: ఒవైసీ సోదరులకు సర్కారు ఝలక్
కోర్టు కేసులతో సతమతమౌతున్న ఎంఐఎం నేతలు, ఒవైసీ సోదరులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కోట్ల రూపాయల విలువ జేసే రెండున్నర ఎకరాల మిథానీ భూములపై స్టే ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో బండ్లగూడలోని ఒవైసీ ఆస్పత్రి సమీపంలోని ఈ భూముల్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు.
అపట్లో కలెక్టర్ నవీన్ మిట్టల్ మిథానీ భూములకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. నకిలీ దృవీకరణ పత్రాలు, కోర్టు డిక్రీలు సృష్టించి ఈ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఒవైసీ ఆసుపత్రి వ్యక్తులు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్టే ను ఇపుడు రాష్ట్ర సర్కారు ఉపసంహరించుకుంది.