: పోలీసుల అదుపులో చింటూ రాయల్ తల్లిదండ్రులు
చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న చింటూ రాయల్ అలియాస్ చంద్రశేఖర్ తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వారు చిత్తూరు రెండో పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తాము సురక్షితంగానే ఉన్నామని మీడియాకు తెలిపారు. తమ అబ్బాయి చింటూ ఎలాంటి తప్పు చేసి ఉండడని, చంపుకునేంత కక్షలు తమ కుటుంబంలో లేవని చెప్పారు. తమ కొడుకు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తాడని అన్నారు. కాగా పరారీలో ఉన్న చింటూ ఆచూకీ కోసం పోలీసులు వారిద్దరినీ ఆరా తీస్తున్నారు.