: 'ఐఎస్ఐఎస్' పేరు చూసి ఎకౌంటును ఆపేసి, ఆపై 'సారీ' చెప్పిన ఫేస్ బుక్


సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ తన తొందరపాటుతో విమర్శలకు గురై, ఆ తరువాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పింది. వివరాల్లోకి వెళితే... ఆమె పేరు ఇసిస్ అంచాలీ (isis anchalee). శాన్ ఫ్రాన్సిస్కోలో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేస్తోంది. ఫేస్ బుక్ లో ఓ ఖాతాను తెరచి యూజర్ నేమ్ గా ఇసిస్ అని పెట్టుకుంది. అదే ఆమె ఖాతా కొంపముంచింది. రెండు రోజుల క్రితం రోజు మాదిరిగానే తన ఖాతాను ఆ యువతి తెరువగా 'ఎకౌంట్ డిజేబుల్డ్' మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే అంచాలీ, తన వ్యక్తిగత వివరాలు తెలుపుతూ ట్విట్టర్ లో ఫేస్ బుక్ నిర్వహిస్తున్న పేజీలో ఫిర్యాదు పెట్టింది. దీంతో ఫేస్ బుక్ పై నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తాయి. "నేను ఒక ఉగ్రవాదినని ఫేస్ బుక్ భావిస్తోంది. నా పాస్ పోర్టు వివరాలను కూడా వారికి పంపాను. నా ఖాతాను తిరిగి తెరిపించడానికి అది చాలినట్టు లేదు. మూడు సార్లు వారికి విజ్ఞప్తి చేసిన తరువాతనే స్పందన వచ్చింది" అని అంచాలీ వెల్లడించింది. దీనిపై ఫేస్ బుక్ స్పందిస్తూ, "నకిలీ ఖాతాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పైర్ వాల్స్ కారణంగానే ఈ ఖాతా ఆగిపోయింది. ఆమె ఖాతాను తిరిగి తెరిపించాం. జరిగిన అసౌకర్యానికి విచారిస్తున్నాం" అంటూ మెసేజ్ పెట్టింది.

  • Loading...

More Telugu News