: 2016 టీ20 వరల్డ్ కప్ మనదే!... టీమిండియా మాజీ కెప్టెన్ శ్రీకాంత్ ప్రకటన


వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీ భారత్ లోనే జరగనుంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియాను పొట్టి ఫార్మాట్ లో బలమైన జట్టుగానే అంతా భావిస్తారు. ఈ భావవతో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఏకీభవించారు. నిన్న హైదరాబాదు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా టీమిండియా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక వచ్చే టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచి తీరుతుందని కూడా శ్రీకాంత్ ప్రకటించారు. ‘‘భారత్ లో టీ20కి మంచి ఆదరణ ఉంది. ఈ ఫార్మాట్ లో మన జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇకపై కూడా బాగా రాణిస్తుందని నా నమ్మకం. భారత్ 2016 ప్రపంచ కప్ నెగ్గుతుందేమో ఎవరికి తెలుసు?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News