: ‘ఉగ్ర’దాడుల సూత్రధారి ఆత్మహత్య చేసుకుని ఉండచ్చు!: ఫ్రెంచ్ అంబాసిడర్
పారిస్ ‘ఉగ్ర’ దాడుల సూత్రధారి అబ్దెల్ హమీద్ అబోద్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఫ్రెంచ్ అంబాసిడర్ ఫ్రాంకోయిస్ రిషియర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెల్లవారుజామున చేపట్టిన తమ ఆపరేషన్ లో హమీద్ అబోద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని అన్నారు. తుది సమాచారం కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. సుమారు ఏడుగంటల పాటు జరిగిన ఆపరేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చామని, ఒక మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చివేసుకున్నట్లు రిషిరీ పేర్కొన్నారు.