: టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలను పట్టించుకోదు: వైఎస్ జగన్
వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలిస్తే ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను పట్టించుకోరని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, గిట్టబాటు ధర లేని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. రైతుల రుణాలు మాఫీ కాలేదని, రెన్యువల్ కాలేదని, 14 శాతం అపరాధ వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయన్నారు. పరిపాలన ఒకరకంగా ఉంది... ఆయన చెబుతున్న మాటలు ఒకరకంగా ఉన్నాయంటూ కేసీఆర్ పై జగన్ మండిపడ్డారు.