: రేపు సాయంత్రం లోగా ప్రచారం ముగించాలి: ఈసీ భన్వర్ లాల్
వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో 9 ఫిర్యాదులు అందాయని ఈసీ భన్వర్ లాల్ అన్నారు. ఈ విషయమై వివరణ కోరుతూ సీఎస్ కు నోటీసులు ఇచ్చామన్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఇప్పటికే వరంగల్ చేరుకున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లోను సాయుధ కానిస్టేబుళ్లు ఉంటారన్నారు. రేపు సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల ప్రచారం ముగించాలన్నారు.