: ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించిన నితీశ్
తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని నితీశ్ కుమార్ ఆహ్వానించారు. ఇవాళ స్వయంగా నితీశ్ మోదీకి ఫోన్ చేశారని, ఈ నెల 20న పాట్నాలోని గాంధీ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించారని బీహార్ సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల ఛత్ వేడుక ముగియడంతో ఈ ఉదయం పలువురు ప్రముఖులకు నితీశే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని చెప్పారు. అయితే ముందుగా ఫిక్స్ చేసిన కార్యక్రమాల వల్ల మోదీ కార్యక్రమానికి రాలేకపోవచ్చని బీహార్ బీజేపీ ఉపాధ్యక్షుడు సంజయ్ మయూఖ్ చెప్పారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీలు హాజరవ్వొచ్చన్నారు.