: కాజీపేట దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేసిన జగన్
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాజీపేటలోని ప్రఖ్యాత హజరత్ సయ్యద్ షా దర్గాను దర్శించుకున్నారు. పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ తదితరులతో కలసి జగన్ హన్మకొండ నుంచి ర్యాలీగా బయలుదేరి దర్గాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుసుర్ పాషా, ఇతర మతపెద్దలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో కొద్దిసేపు జగన్ ప్రార్థనలు చేశారు. తన తండ్రి, దివంగత వైఎస్ ముస్లింల కోసం రిజర్వేషన్లు సహా ఎంతో చేశారని, అవన్నీ దృష్టిలో ఉంచుకుని ముస్లింలందరూ తమ పార్టీ వరంగల్ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కు మద్దతు పలకాలని కోరారు.