: రాజయ్య కోడలు మృతి కేసులో నిజాల వెలికితీత షురూ!...అనిల్ ను కస్టడీకి తీసుకున్న పోలీసులు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసులో వాస్తవాల వెలికితీతకు పోలీసులు రంగంలోకి దిగారు. వరంగల్ ఉప ఎన్నికలో తెల్లవారితే సిరిసిల్ల రాజయ్య నామినేషన్ అనగా... తెల్లవారుజామున సారిక తన ముగ్గురు పిల్లలతో కలిసి సజీవ దహనమైంది. కేసు దర్యాప్తులో భాగంగా సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ (సారిక భర్త)లను ఘటన జరిగిన నాడే అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనిల్ రెండో భార్యగా భావిస్తున్న సననను కూడా అరెస్టల్ చేశారు. తాజాగా కేసులో వాస్తవాలను వెలికితీసే క్రమంలో అనిల్ ను విచారించాల్సి ఉందన్న వరంగల్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు అతడిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో కొద్దిసేపటి క్రితం కోర్టు అనుమతితో అనిల్ ను తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రేపు కూడా ఈ విచారణ కొనసాగనుంది. ఈ విచారణలోనే అనిల్ నుంచి పోలీసులు నిజం కక్కించే అవకాశాలున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News