: చిత్తూరుకు నారా లోకేశ్...‘కఠారి’ దంపతులకు నివాళి అర్పించనున్న టీడీపీ యువనేత
చిత్తూరు జిల్లాలో టీడీపీకి కఠారి మోహన్ కీలక నేత. విపక్షాల దాడులకు ఎదురొడ్డి పార్టీ కేడర్ ను నిలబెట్టడంలో ఆయన ఎనలేని కృషి చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. నిన్న ఉదయం పట్టపగలు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోనే జరిగిన దుండగుల మెరుపు దాడిలో మోహన్ తో పాటు ఆయన సతీమణి, నగర మేయర్ అనురాధ చనిపోయారు. ఈ ఘటన టీడీపీ కేడర్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు పార్టీ నేతలంతా షాక్ కు గురయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ దాడితో తీవ్ర కలవరపాటుకు గురయ్యారు. నేడు చిత్తూరుకు రానున్న ఆయన కఠారి దంపతుల మృతదేహాలకు నివాళి అర్పించనున్నరు. అదే సమయంలో కఠారి కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శిస్తారు.