: వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన 22 మంది కూలీలు!


నెల్లూరు జిల్లాలో 22 మంది కూలీలు వరదప్రవాహంలో చిక్కుకుపోయారు. వాకాడు మండలంలోని ముట్టెంబాకలో చిక్కుకుపోయిన కూలీలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం కారణంగా రెస్క్యూ టీమ్ లు అక్కడికి చేరుకోలేకపోయాయి. రాత్రి సమయం కావడంతో చిక్కుకుపోయిన కూలీలు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా సరే, వారిని రక్షించాలంటూ కూలీల బంధువులు వేడుకుంటున్నారు. వరద బాధితులను రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. కానీ, వాతావరణం అనుకూలించకపోవడం, రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం వంటి పలు కారణాలతో కొన్ని గ్రామాల్లో చిక్కుకుపోయిన బాధితులకు సహాయక చర్యల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News