: ప్రముఖ తమిళ గాయకుడు మురుగదాస్ కన్నుమూత
ప్రఖ్యాత తమిళ ఆధ్యాత్మిక గాయకుడు పితుకులి మురుగదాస్ ఈ ఉదయం చెన్నైలో కన్ను మూశారు. గతకొంత కాలంగా ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. 1920 జనవరి 25న కోయంబత్తూరులో జన్మించిన మురుగదాస్... స్వాతంత్ర్య సమరంలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసుల చేత దెబ్బలు తిని ఎడమ కంటి చూపును కోల్పోయారు. అనంతరం, 1947లో తన మ్యూజిక్ కెరియర్ ను ప్రారంభించారు. మురుగదాస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, సంగీత రంగానికి చెందిన వారు సంతాపం ప్రకటించారు.