: గ్రీసులో భూకంపం... ఇద్దరి మృతి
గ్రీసు పశ్చిమ భూభాగంలోని లెఫ్కడ ద్వీపంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.7గా నమోదైనట్లు అక్కడి వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం మధ్యదరా సముద్రంలో ఏర్పడి ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ సంఘటనలో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.