: వీహెచ్ పీ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత


విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అధినేత అశోక్ సింఘాల్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో, గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 14వ తేదీన న్యుమోనియా, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపుడుతున్న సింఘాల్ ను మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. అశోక్ సింఘాల్ మరణ వార్తను వీహెచ్ పీ అధినేత ప్రవీణ్ తొగాడియా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన వయసు 89 సంవత్సరాలు.

  • Loading...

More Telugu News