: అది చిత్తూరు ఫ్యాక్షనిస్టుల పనే... టీడీపీ ఎమ్మెల్సీ గాలి వ్యాఖ్య
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త, టీడీపీ కీలక నేత కఠారి మోహన్ లపై జరిగిన దాడిపై టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వేగంగా స్పందించారు. కఠారి దంపతులపై కర్ణాటకకు చెందిన వ్యక్తులు దాడి చేశారన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ దాడి చిత్తూరు ఫ్యాక్షనిస్టుల పనేనని ఆయన తేల్చిచెప్పారు. కర్ణాటకకు చెందిన వ్యక్తులు కఠారి దంపతులపై దాడి చేయాల్సిన అవసరమేమీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీలో కష్టపడే తత్వమున్న కార్యకర్తగా అనురాధ పేరు తెచ్చుకున్నారని, ఆమె మృతి పార్టీకి తీరని లోటన్నారు. దివంగత నందమూరి తారకరామారావుపై ఎనలేని గౌరవమున్న కఠారి దంపతులు పార్టీకి నమ్మిన బంటులని గాలి పేర్కొన్నారు.