: 'సమంత' చీరకట్టుపై వెంకయ్యనాయుడి చమక్కులు!
కేంద్ర మంత్రి నోటి వెంట హీరోయిన్ సమంత పేరు వచ్చింది. 'ఆమె అప్పుడప్పుడు చీరను కట్టుకుంటుంది' అని చమక్కులు కూడా వేశారు. ఎప్పుడో తెలుసా? నిన్న గుంటూరు లాం సమీపంలో వ్యవసాయ యూనివర్శిటీకి శంకుస్థాపన జరిగిన వేళ, సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు వేదికపై ఉండగా, ప్రసంగించిన వెంకయ్య, ఇటీవలి మోదీ బ్రిటన్ పర్యటనను గుర్తుకు తెచ్చుకున్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భార్య చీర కట్టుకు వచ్చిందని చెప్పారు. (ఆమె పేరు కూడా సమంతాయే) మోదీ ప్రభావంతో, భారతీయతకు అద్దం పడుతూ సమంత చీరకట్టుకుని వచ్చారని, మనకూ ఓ సమంత ఉందని, ఆమె అప్పుడప్పుడూ చీరలో కనిపిస్తుందని సెటైర్లు వేశారు. మన సమంత చీర కట్టిందంటే సరే... కామెరాన్ భార్య కూడా కట్టుకుందంటే... అని 'అది మోదీకి దక్కిన గౌరవమే' అన్నారు. ఆయన మాటలతో వేదికపై నవ్వులు వెలిశాయి.