: చోటా రాజన్ కస్టడీ పొడిగింపు


గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు సీబీఐ కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించారు. వాస్తవానికి ఈ రోజుతో సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో, మరికొన్నాళ్లు కస్టడీ అవసరమని సీబీఐ కోరడంతో, నవంబరు 19 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలోని సెల్ లోనే ఉంచి చోటారాజన్ ను విచారిస్తున్నారు. ఇతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేయగా, అక్కడి నుంచి చోటా రాజన్ ను భారత్ కు తరలించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News