: ‘రిలయన్స్’ స్పోర్ట్స్ సీఓఓ గా సుందర్ రామన్ నియామకం


రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా సుందర్ రామన్ నియమితులయ్యారు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఆయన రిలయన్స్ స్పోర్ట్స్ సీఓఓగా బాధ్యతలు తీసుకుంటారని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ, ‘నన్ను రిలయన్స్ స్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమించడం చాలా ఆనందంగా ఉంది. నా ముందున్నది కీలకమైన సవాల్ గా భావించి రిలయన్స్ అభివృద్ధిలో పాలుపంచుకుంటాను’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈనెల తొలి వారంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కార్యనిర్వాహణాధికారి (సీఓఓ) పదవికి సుందర్ రామన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ లో స్పోర్ట్స్ పెట్టుబడుల్లో ముందు వరుసలో ఉన్న ‘రిలయన్స్’కు సుందర్ సేవలు ఉపయోగపడతాయని ఆ సంస్థ పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News